paluke bangaramayena lyrics in telugu
పలుకే బంగారమాయెనా
పల్లవి : పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
చ1 : పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||
చ2 : ఇరవుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||
చ3 : రాతి నాతిగ జేసి భూ తల మందు
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||
చ4 : ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రి || పలుకే ||
చ5 : శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకావా
కరుణించు భద్రాచల వరరామదాస పోష || పలుకే ||

Comments
Post a Comment