kashmiri loyalo song lyrics in telugu

కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ 
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ 
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే
చెమ్మాచెక్కా చేత చిక్క
మంచుమల్లె మారిపోయే మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ 
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ 

తేనేటి వాగుల్లో తెడ్డేసుకో
పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలికాచుకో
ముద్దారిపోయాక పొద చేరుకో
గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా
గుట్టమైన సోకు నీదే కాదా
అరె తస్సా చెక్కా ఆకు వక్క
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము

కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ 
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ 

సింధూర రాగాలు చిత్రించుకో
అందాల గంధాల హాయందుకో
పన్నీటి తానాలు ఆడేసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో
చిలక పచ్చ రైక బిగి చూసుకో
గూటి పడవల్లోన చాటుగా కలిశాక 
నీటికైనా వేడి పుట్టాలిలే
పుత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు

అరె కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ 
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ 
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే
చెమ్మాచెక్కా చేత చిక్క
మంచుమల్లె మారిపోయే మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు

                                                                       Lyrics Writer :  వేటూరి  , 
                                                                                     Singer :  యస్ పి బాలు ,  యస్. జానకి , 

Comments

Popular posts from this blog

eppudoo oppukovadduraa otami song lyrics telugu

Sreevalli pushpa song lyrics

minneti suridu vachenamma song lyrics