Nelluri Nerajana Song Lyrics

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే

జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని
వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు 
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ... ఓ... ఓ... ఓ.. 

Comments

Popular posts from this blog

eppudoo oppukovadduraa otami song lyrics telugu

Sreevalli pushpa song lyrics

minneti suridu vachenamma song lyrics